దూసుకొస్తున్న సూర్య ‘సింగం’ !
Published on Nov 24, 2016 8:52 am IST

s3
తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం3’ శరవేగంగా దూసుకొస్తోంది. ఆయన నటించిన సూపర్ హిట్ ‘సింగం’ సిరీస్ లో కొనసాగింపుగా ‘సింగం 3’ రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు హరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రసుతం పోస్టర్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. స్టూడియో గ్రీన్ సంస్థ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 16 న తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్ర ఆడియోని డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్, కొంత కాలం క్రితం రిలీజైన ఫస్ట్ లుక్స్ బాగుండటంతో ఈ సినిమా పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ సమర్పిస్తున్నారు. అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, నాజర్ తదితరులు పలు ప్రధాన పాత్రలు పోషించగా హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook