భారీ ధర పలికిన ‘బాహుబలి 2’ తమిళ హక్కులు !
Published on Jan 28, 2017 11:54 am IST


భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమల ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. మొదటి పార్టీ సృష్టించిన ప్రభంజనంతో ఈ రెండవ భాగంపై భారీ హైప్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా హక్కుల్ని కొనుక్కునేందుకు పలువూరు బడా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, పలు ప్రొడక్షన్ హోస్ లు పోటీ పడుతున్నాయి. తాజాగా తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కళ్ళు చెదిరే భారీ ధరకు అమ్ముడయ్యాని తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్’ అతి భారీ మొత్తం వెచ్చించి ఈ హక్కుల్ని కైవసం చేసుకుందట. అమౌంట్ ఎంతో బయటకు రాలేదు కానీ రజనీకాంత్ మినహా మిగిలిన అందరు తమిళ స్టార్ హీరోల సినిమాలకన్నా ఈ మొత్తం ఎక్కువని మాత్రం తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం యొక్క హిందీ శాటిలైట్ హక్కుల్ని సోనీ టీవీ నెట్వర్క్ రూ. 51 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అతి భారీ స్థాయిలో జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన ఈ అద్భుతాన్ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook