మెగా హీరోతో చిందులు వేయనున్న ‘బాహుబలి’ మనోహరి !
Published on Mar 26, 2017 1:21 pm IST


‘బాహుబలి-ది బిగినింగ్’ చిత్రంలో బాగా పాపులర్ అయిన పాటల్లో ‘మనోహరి’ కూడా ఒకటి. ఈ పాటలో ప్రభాస్ తో ముగ్గురు మెరుపు తీగలు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పేర్లు తెలియక పోయినా ఇప్పటికీ ఆ ముగ్గురినీ చూడగానే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరైన మధు స్నేహా మెగా హీరో వరుణ్ తేజ్ తో చిందులు వేయనుంది.

ప్రస్తుతం షూటింగ్ ఆఖరి దశలో ఉన్న తేజ్ ‘మిస్టర్’ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. అందుకోసం పలువురు నటీమణులను సంప్రదించిన శ్రీను వైట్ల చివరికి మధు స్నేహాను ఫిక్స్ చేశారట. వచ్చే వారంలో ఈ పాట షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుందని, ఇందు కోసం భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. పూర్తి స్థాయి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తుండగా సినిమా ఏప్రిల్ నెలలో రిలీజవుతుంది.

 
Like us on Facebook