రిపీట్ కానున్న ‘బాహుబలి’ కాంబినేషన్ !
Published on Oct 16, 2017 3:09 pm IST

‘బాహుబలి’ ప్రాంచైజీ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతలా అలరించిందో తెలిసిన సంగతే. ఈ సినిమాలో కనిపించిన ప్రతి పాత్ర, అందులోని నటులు అడియన్సుకు బాగా గుర్తుండిపోయారు. ముఖ్యంగా ‘కట్టప్ప’ పాత్ర అందులో నటించిన సత్యరాజ్, ప్రతినాయకుడిగా నటించిన రానా, ఆయన చేసిన ‘భల్లాలదేవ’ పాత్రలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ఈ పాత్రల గురించి తెలీని సినీ ప్రేక్షకుడుండడంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ నటులు మరోసారి కలిసి నటిస్తే చూడాలని అందరూ అనుకుంటున్నారు.

వారి కోరికను నిజం చేసేలా రానా, సత్యరాజ్ లు కలిసి నటించబోతున్నారు. అది కూడా పిరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామాలో కావడం విశేషం. సత్యశివ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా 1945 కాలంలో జరిగిన కథగా ఉండనుంది. ఇందులో రానా సుభాష్ చంద్రబోస్ ఆర్మీ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లో సైనికుడిగా కనిపించనున్నాడు. ఇది వరకే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా కొచ్చిలో రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఇందులో సత్యరాజ్ కూడా పాల్గొంటున్నారు.

ఈ ద్విభాషా చిత్రానికి తెలుగులో ‘1945’ అని తమిళంలో ‘మడై తిరంతు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ ప్రేమ కథలో రానాకు జోడీగా రెజినా నటిస్తోంది.

 
Like us on Facebook