అంచనాలకు మించి బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం !
Published on Apr 29, 2017 9:34 am IST


ప్రపంచ స్థాయిలో బాహుబలి 2 వసూళ్ల ప్రభంజనం మొదలు పెట్టింది.విజువల్ వండర్ గా వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ విష్యం లో జాతీయ స్థాయి లో రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖుల అంచనాలను కూడా దాటి బాహుబలి 2 వసూళ్ల ప్రభంజనం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఏ చిత్రమైనా తొలి రోజు రెండంకెల వసూళ్లు మాత్రమే సాధించాయి. కానీ బాహుబలి 2 కలెక్షన్లు తొలి రోజే 100 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. కబాలి 45 కోట్ల రికార్డ్ ని ఈ చిత్రం చెరిపేసింది. కాగా యూఎస్ లో ఈ చిత్రం ప్రీమియర్ షోలకు మాత్రమే 3 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించడం విశేషం.కాగా శుక్రవారం మరో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. తొలి వీకెండ్ లో బాహుబలి 2 చిత్ర యూఎస్ వసూళ్ల 8 మిలియన్ డాలర్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

 
Like us on Facebook