బాహుబలి బ్లాక్‌టికెట్ల వివాదంపై పిల్‌ను కొట్టేసిన హైకోర్టు!

బాహుబలి బ్లాక్‌టికెట్ల వివాదంపై పిల్‌ను కొట్టేసిన హైకోర్టు!

Published on Jul 10, 2015 2:48 PM IST

baahubali-b
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ నేడు ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే! భారత దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, గత కొన్ని దశాబ్దాలుగా వేరే ఏ ఇతర సినిమాకూ లేనన్ని ప్రత్యేకతలతో ఈ సినిమా విడుదల కావడంతో మొదట్నుంచీ ఈ సినిమాపై సగటు అభిమాని ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజుల్ టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్‌లో పూర్తిగా అమ్ముడై సంచలనం సృష్టించాయి.

ఇక ఇదే నేపథ్యంలో ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ రేట్లను అమాంతంగా పెంచేసి బ్లాక్ వ్యాపారానికి తెరతీశారనే వాదనలు వినిపించాయి. ఈ విషయమై సినీ ప్రేక్షక సంఘం ఏకంగా హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది. ఈ పిల్‌పై స్పందించిన హైకోర్టు, సరైన ఆధారాలేవీ లేకుండా దాఖలైన ఈ పిల్‌ను స్వీకరించలేమని తేల్చేసి, పిల్‌ను కొట్టివేసింది. దీంతో బాహుబలి సినిమా బ్లాక్ టికెట్ల విషయంలో బాహుబలి టీమ్‌కు ఊరట లభించినట్లైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు