బడే మియా ఛోటే మియా: భారీగా డ్రాపైన వసూళ్లు…వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటన!

బడే మియా ఛోటే మియా: భారీగా డ్రాపైన వసూళ్లు…వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటన!

Published on Apr 16, 2024 12:48 PM IST


అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ ప్రధాన పాత్రల్లో, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా ఛోటే మియా. గతవారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టినప్పటికీ, వీక్ డేస్ స్టార్ట్ అవ్వగానే వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. సోమవారం రోజున ఈ చిత్రం 2.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మేకర్స్ ఒకటి టికెట్ కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్ ను కూడా ప్రకటించారు. ఏదేమైనా, ఇంత భారీ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు షాక్ కు గురి చేస్తున్నాయి. వాషు భగ్నాని, జాకీ భగ్నాని, అలీ అబ్బాస్ జాఫర్, దీప్శిఖా దేశ్‌ముఖ్, హిమాన్షు కిషన్ మెహ్రా లు నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ మిశ్రా సంగీతం అందించారు. మార్సిన్ లాస్కావిక్ సినిమాటోగ్రాఫర్ గా, స్టీవెన్ బెర్నార్డ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు