యంగ్ హీరో సినిమాకి ముహుర్తం పెట్టింది బాలయ్యేనట !
Published on Oct 11, 2017 1:33 pm IST

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి తన కుమారుడు ఆకాష్ పూరిపై ఫోకస్ చేశాడు. ఆకాష్ పూరి ఇదివరకే ‘ఆంధ్రాపోరి’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది సక్సెస్ కాకపోవడంతో ఈసారి కుమారుడ్ని పూర్తిస్థాయి హీరోగా రీ లాంచ్ చేయాలని భావించిన పూరి ‘మెహబూబా’ ను మొదలుపెట్టాడు. ఈ చిత్ర షూటింగ్ ఈరోజు ఉదయమే హిమాచల్ ప్రదేశ్ లో మొదలైంది.

ఇందులో విశేషమేమిటంటే ఈ రెగ్యులర్ షూట్ కు ముహుర్తాన్ని నిర్ణయించింది బాలయ్యేనట. గతంలో పూరితో కలిసి ‘పైసా వసూల్’ సినిమా చేసిన బాలక్రిష్ణ ఆ సాన్నిహిత్యంతోనే స్వయంగా అన్ని విధాలా మంచిదైన ముహుర్తాన్ని సూచించారట. చిత్ర యూనిట్ కూడా బాలక్రిష్ణగారు సూచించిన సమయానికే సినిమాను ప్రారంభించామని, ఆయన ముహుర్తం పెట్టడం తమకు ఆశీర్వాదమని అన్నారు. పూరి తన సొంత నిర్మాణ సంస్థ పూరి జగన్ టూరింగ్ టాకీస్ పై నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook