బాలకృష్ణ చాయిస్ తేజానే !
Published on Oct 11, 2017 6:32 pm IST

నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావుగారి జీవితాన్ని తెరకెక్కించే పనిని వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక టీమ్ తో పరిశోధన కూడా నిర్వహించి సినిమాకు కావాల్సిన స్క్రిప్టును కూడా సిద్ధం చేశారాయన. ఇకపోతే ఈ చిత్రాన్ని ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ తో విజయాన్ని అందుకున్న దర్శకుడు తేజా డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి.

తేజా కూడా పలు ఇంటర్వ్యూల్లో తాను ఎన్టీఆర్ కు వీరాభిమానినని, ఆయన బయోపిక్ ను డైరెక్ట్ చేయాలని ఉందని, ఈ విషయమై బాలకృష్ణగారిని కూడా కలిశానని అన్నారు. అయితే తానే దర్శకుడినని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. బాలకృష్ణ కూడా తేజానే డైరెక్టరని ఎక్కడా ప్రకటించలేదు. దీంతో అభిమానుల్లో కాస్తంత గందరగోళం నెలకొంది. మరోవైపు వర్మ శరవేగంగా తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను మొదలుపెడుతుండటంతో ఆ గందరగోళం కాస్త కంగారుగా మారింది. వీటన్నిటినీ పోగొట్టేలా తేజానే బాలకృష్ణ చేయనున్న బయోపిక్ ను డైరెక్ట్ చేస్తారని తేలిపోయింది. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఇంకా బయటకురాలేదు.

 
Like us on Facebook