స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1′. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తాజాగా దర్శకుడు కొరటాల శివ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్నాయి. ‘ఇటీవల తారక్ కూడా దేవర గురించి మాట్లాడారు. ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు మరియు నాకు ఈ సినిమా కచ్చితంగా సినిమా కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది’ అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఎలాగూ ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ వేగంగా జరగనుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.