బాలయ్య ‘జై సింహ’ ఆడియో డేట్ ఫిక్స్ !
Published on Nov 15, 2017 11:05 am IST

నందమూరి బాల‌కృష్ణ నటిస్తోన్న 102వ చిత్రం ‘జై సింహ’. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.కల్యాణ్ నిర్మాత‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార, నాటాషా జోషి, హరిప్రియ నాయికలుగా నటిస్తోన్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు కథ, మాటలు ఎం.రత్నం అందించారు. చిరంతన్‌ భట్‌ సంగీత దర్శకుడు. డిసెంబర్ 23 న ఈ సినిమా ఆడియో ను విజయవాడలో ఘనంగా జరపబోతున్నారు. ఈ సినిమా తరువాత తేజ దర్శకత్వంలో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook