క్యాన్సర్ పై యుద్దానికి సిద్దమైన బాలకృష్ణ !
Published on Oct 12, 2017 4:27 pm IST

నటుడు నందమూరి బాలక్రిష్ణ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలను కూడా చూసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను నడుపుతూ క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్న ఆయన ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నటి, సామాజిక కార్యకర్త అయినా గౌతమి తన ‘లైఫ్ అగైన్’ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ అక్టోబర్ 28న వైజాగ్లో జరగనుంది. ఈ ర్యాలీలో బాలకృష్ణ కూడా పాల్గొని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించే ప్రయత్నం చేయనున్నారు. ఆయనతో పాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరియు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 
Like us on Facebook