బాలయ్య మాస్ ఎనర్జీ, డెడికేషన్ తో అదిరిన “మా బావ మనోభావాలు”.!

బాలయ్య మాస్ ఎనర్జీ, డెడికేషన్ తో అదిరిన “మా బావ మనోభావాలు”.!

Published on Dec 24, 2022 3:36 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సాలిడ్ అంచనాలు నెలకొనగా ఈ సినిమా నుంచి అయితే సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన లేటెస్ట్ సాంగ్స్ ప్రతి ఒక్కటీ కూడా సూపర్ హిట్ కాగా ఇక లేటెస్ట్ గా వచ్చిన మాస్ అండ్ ఐటెం నెంబర్ “మా బావ మనోభావాలు” కూడా అదిరే లెవెల్లో ఉందని చెప్పి తీరాలి.

రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యానికి థమన్ మరోసారి పర్ఫెక్ట్ ట్యూన్ ని జోడించడం ఒకెత్తు అయితే ఈ సాంగ్ లో బాలయ్య పై చూపించిన స్టెప్పుల తాలూకా విజువల్స్ మరో ఎత్తు అని చెప్పాలి. ఎప్పటి లానే అదిరే ఎనర్జీతో క్రేజీ స్టెప్పులు వేసి అదరగొట్టే బాలయ్య ఈ సాంగ్ కి మాత్రం మరింత స్థాయిలో తన డెడికేషన్ ని చూపించారని చెప్పాలి.

అసలు వయసు అనేది లెక్కే లేకుండా తాను వేసిన పర్టిక్యులర్ స్టెప్స్ అయితే తన డెడికేషన్ ని చూపిస్తున్నాయి. దీనికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఓవరాల్ గా మాత్రం ఈ సాంగ్ కి థియేటర్ లో బాలయ్య డాన్స్ విశ్వరూపం చూడబోతున్నాం అనేది ఖరారు అయ్యిపోయింది.

ఇక బాలయ్యతో ఈ సాంగ్ లో కనిపించిన చంద్రిక రవి మరియు హానీ రోస్ లో తమ గ్లామ్ షో అండ్ బాలయ్య తో డాన్స్ లతో ఆకట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ బాలయ్య కోసం చాలా క్యాచీ అండ్ సూపర్బ్ స్టెప్ లు క్రియేట్ చేయడం బాలయ్య వాటిని చిరునవ్వుతో చేసేయడం ఈ సాంగ్ లో అతి పెద్ద ఎసెట్.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు