లేటెస్ట్..మాసివ్ బిజినెస్ లో బాలయ్య “అఖండ”.!

Published on Sep 25, 2021 2:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో “అఖండ” అనే ఇంట్రెస్టింగ్ మాసివ్ బొనాంజా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్క బాలయ్య అభిమానుల్లోనే కాకుండా మాస్ ఆడియెన్స్ లో కూడా మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఆల్రెడీ సాలిడ్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే.

హిందీ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలయ్య కెరీర్ లోనే మాసివ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఒకటి ఈ సినిమాపై వినిపిస్తుంది. ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులు ఈ సినిమాకి ఏకంగా 5 కోట్లకి పైగా జరిగినట్టు సినీ వర్గాల్లో టాక్. దీనిని బట్టి అఖండ థియేట్రికల్ రిలీజ్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి అంతే కాకుండా ఇంకా దసరా రిలీజ్ కే ఉంటుంది అని కూడా టాక్ నడుస్తూనే ఉంది.

సంబంధిత సమాచారం :