“పుష్ప” సినిమాపై “బీస్ట్” దర్శకుడి రెస్పాన్స్.!

“పుష్ప” సినిమాపై “బీస్ట్” దర్శకుడి రెస్పాన్స్.!

Published on Jan 14, 2022 10:34 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెల్సిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమాకి ఇప్పుడు వరకు కూడా ప్రశంసలు ఎక్కడా తగ్గడం లేదు. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సాలిడ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంది. ముఖ్యంగా హిందీ మరియు తమిళ్ భాష ప్రముఖులలో పుష్ప పై టాక్ ఇంకా అదిరే లెవెల్లో అందుకుంటుంది.

లేటెస్ట్ గా కోలీవుడ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ నెల్సన్ దిలీప్ కుమార్ తన రెస్పాన్స్ ని వ్యక్త పరిచాడు. పుష్ప సినిమా అదిరిపోయింది అని అల్లు అర్జున్ పుష్ప గా తన కమాండబుల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్ట్ గా నిలవడంతో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. మరి ఇదిలా ఉండగా ఈ దర్శకుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో “బీస్ట్” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు