కమల్ సినిమా కోసం పాట పాడిన హీరోయిన్ !
Published on Dec 6, 2017 9:03 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘విశ్వరూపం-2’ ఆఖరి దశకు చేరుకుంది. కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఒక పాటను హీరోయిన్ ఆండ్రియా పాడారు. ఆండ్రియా కూడా ఈ సినిమాలోని ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

రొమాంటిక్ ఫ్లోలో ఉండనున్న ఈ పాటకు స్వతహాగానే గాయని అయిన ఆండ్రియా గాత్రమైతే బాగుంటుందని భావించిన సంగీత దర్శకుడు జిబ్రాన్ ఆమె చేతనే పాటను పాడించారట. 2013 లో వచ్చిన ‘విశ్వరూపం’ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ విడుదలచేయనున్నారు. టెర్రరిజం నైపథ్యంలో సాగే ఈ సినిమాలో రాహుల్ బోస్, పూజ కుమార్లు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook