షర్ట్ లేకుండా కేకపుట్టిస్తున్న యంగ్ హీరో

Published on Jul 23, 2019 2:49 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అరంగేట్రమే అదిరి పోయే రేంజ్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ,స్టార్ హీరోయిన్ సమంత జోడీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “అల్లుడు శ్రీను” చిత్రంతో ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆరడుగుల హైట్, కండలు తిరిగిన బాడీ గల బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ హీరోకి పర్ఫెక్ట్ మ్యాచ్. ఆయన ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నీ దాదాపు ఆ కోవకు చెందినవే. తాజాగా విడుదలైన “సీత” చిత్రంలో మాత్రం కొంచెం వైవిధ్యమైన పాత్రను చేశాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు.శ్రీనివాస్ జిమ్ లో షర్ట్ లేకుండా కండలు తిరిగిన శరీరాన్ని కలిగివున్న ఆ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఫోటో తో పాటు ఓ మంచి స్ఫూర్తి దాయక మాట కూడా పోస్ట్ చేశాడు. బెల్లంకొండ ప్రస్తుతం నటించిన క్రైమ్ థ్రిల్లర్ “రాక్షసుడు” ఈ ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది. అలాగే ఈ చిత్రం తరువాత ఆయన ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయో పిక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :