‘రుద్రమదేవి’ని అధిగమించిన ‘భాగమతి’ !

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం ‘భాగమతి’ అన్ని ఏరియాల్లోను విజయపథంలో దూసుకుపోతోంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ బలమైన రన్ తో నడుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్కుకు దగ్గరపడుతోందీ చిత్రం.

గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’ యూస్లో 9.71 లక్షల డాలర్లను వసూలు చేయగా ‘భాగమతి’ దాన్ని క్రాస్ చేసి ఇప్పటికి 9.80 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుని ఇంకొద్ది రోజుల్లో మిలియన్ మార్కను అధిగమించనుంది. సౌత్ ఇండియన్ హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి.