‘భాగమతి’ ఏపి, తెలంగాణ వసూళ్ళ వివరాలు !

అనుష్క తాజా చిత్రం ‘భాగమతి’ భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన అన్ని ఏరియాల్లోను మొదటి రోజే మంచి టాక్ రావడంతో రెండు, మోడివా రోజులో వసూయలు మెరుగ్గా కొనసాగాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు త్వరలోనే సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఏపి, తెలంగాణాలో మూడు రోజులకు కలిపి రూ.12.01 కోట్ల షేర్ ను వసూలు చేసిందీ చిత్రం.

ఏరియాల వారిగా వసూళ్ల వివరాలను చూస్తే అత్యధికంగా నైజాంలో రూ. 4.89 కోట్లు రాబట్టిన ఈ సినిమా సీడెడ్ లో రూ.1.63 కోట్లు, గుంటూరులో రూ. 96 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ .91 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.47 కోట్లు వసూలు చేసింది.