జస్ట్ రెండు నిముషాలకి రెండు కోట్లు అంటా !

Published on Dec 11, 2018 1:53 am IST

కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖర్లో ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం వియాత్నంలో బంగారు వర్ణంలో ఉండే బిస్కెట్స్ తో ప్రత్యేకమైన భారీ సెట్ ను కూడా నిర్మిస్తోంది చిత్రబృందం.

ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుందట. ఈ సీన్ రెండు నిమిషాలే ఉన్నప్పటికీ.. రెండు కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ సెట్ ను నిర్మిస్తోన్నారట. ఆ సెట్ లోపలికి వెళ్తే.. బంగారం గనిలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందట. మొత్తానికి టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు.

ఇక ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ కూడా ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.

సంబంధిత సమాచారం :