ఇతర భారతీయ భాషల్లో సైతం రిలీజ్ కానున్న ‘భారతీయుడు-2’ !
Published on Oct 1, 2017 12:29 pm IST


21 సంవత్సరాల క్రితం శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో రూపొందిన ‘భారతీయుడు’ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ రూపొందనుంది. అది కూడా భారీ బడ్జెట్ తో కావడం విశేషం. మూడేళ్ల క్రితం శంకర్ మదిలో మెదిలిన ఈ కథ ఇప్పుడు కమల్ రాజకీయ ప్రవేశం సమయంలో రూపుదిద్దుకోనుండటంతో అందరిలోనూ అమితాశక్తి నెలకొంది.

ఈ సినిమాను ముందుగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందించాలని అనుకున్నారు. కానీ దక్షిణాది సినిమాకు ఈ మధ్య కాలంలో మార్కెట్ బాగా పెరిగిన నైపథ్యంలో ఈ రెండు భాషలతో పటు ఇతర భారతీయ భాషల్లో సైతం సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతం శంకర్ యొక్క ‘రోబో-2’, కమల్ హాసన్ యొక్క ‘విశ్వరూపం-2, శభాష్ నాయుడు’ పనులు పూర్తవగానే ఈ చిత్రం మొదలవుతుంది.

 
Like us on Facebook