ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ !

ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ !

Published on Jan 26, 2018 3:54 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. ‘శ్రీమంతుడు’ తరవాత కొరటాల శివతో మహేష్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రాజకీయ నైపథ్యంలో ఉండనున్న ఈ సినిమా కథ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నడిచే ఫిక్షనల్ పాలిటికల్ డ్రామా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ అన్నారు.

ఈరోజు రిపబిక్ డే సందర్బంగా టీమ్ విభిన్నమైన పద్దతిలో రిలీజ్ చేసిన మహేష్ ప్రమాణ శ్వీకారం అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అంతేగాక మహేష్ ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఇంప్రెస్ చేసింది. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు