మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కలిసి చేస్తోన్న రెండో సినిమా భరత్ అనే నేను. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ ఓట్ రూపంలో జనవరి 26 న విడుదల చేసిన మహేష్ బాబు వాయిస్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం మర్చి మొదటి వారంలో పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ 27 న సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


