‘భరత్ అనే నేను’ షూటింగ్ అప్డేట్ !
Published on Oct 30, 2017 8:31 am IST


‘స్పైడర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడం వలన ‘భరత్ అనే నేను’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేగాక మహేష్ తో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక బస్టర్ ను రూపొందించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.

గత మూడు రోజుల నుండి నగరంలోని చిరాన్ ఫోర్ట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లోనే కీలకమైన సిఎం చాంబర్ సన్నివేశాలని షూట్ చేశారు. ఇకపోతే ముందుగా ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ నెల 20న విడుదల చేస్తారని వార్త బయటకిరాగా ఇప్పుడు 27న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణమే సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook