భరత్ అనే నేను షూటింగ్ వివరాలు !
Published on Feb 15, 2018 10:32 pm IST

డివివి దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా భరత్ అనే నేను. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లింగంపల్లి సమీపంలో ఒక ధియేటర్ లో ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 26 న ప్రపంచ వ్యాపంగా విడుదల కానుంది.

కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఉన్నాయి. . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండడం విశేషం. మర్చి రెండోవారం లో భరత్ అనే నేను సినిమా భారి ఆడియో ఫంక్షన్ చెయ్యబోతునట్లు సమాచారం.

 
Like us on Facebook