అక్కడ 400 థియేటర్స్ లో “భీమ్లా” మాస్ రిలీజ్.!

Published on Feb 18, 2022 7:19 am IST


మళ్లీ చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఓ సినిమా రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున మాస్ వైబ్రేషన్స్ ని తీసుకొచ్చింది మాత్రం “భీమ్లా నాయక్” అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఇది. మరి అవ్వడానికి రీమేక్ అయినా కూడా ఇప్పుడు ఈ సినిమా పై ఉన్న అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి.

మరి అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా భారీ రిలీజ్ కి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఆల్రెడీ యూఎస్ లో ఏకంగా 400 కి పైగా థియేటర్ లలో మాస్ రిలీజ్ ఈ సినిమా అవుతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే భీమ్లా నాయక్ పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :