బుల్లితెర పై “బిచ్చగాడు 2” కి సూపర్ రెస్పాన్స్!

బుల్లితెర పై “బిచ్చగాడు 2” కి సూపర్ రెస్పాన్స్!

Published on Dec 7, 2023 4:05 PM IST

విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో, విజయ్ ఆంటోనీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు 2. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బిచ్చగాడు చిత్రం గతం లో సెన్సేషన్ హిట్ సాధించగా, ఇది ఆ చిత్రానికి కొనసాగింపు గా వచ్చింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఈ చిత్రం ప్రసారం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది. ఈ చిత్రం 7.12 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పై నిర్మించగా, విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు