మరో చిత్రానికి రెడీ అవుతున్న సూపర్ హిట్ కాంబినేషన్ !
Published on Jan 25, 2017 10:32 am IST


తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు బ్లాక్ బాస్టర్ చిత్రాలు వచ్చాయి. తుపాకీ, కత్తి చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చినవే. కాగా ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం పై కన్నేసినట్లు తెలుస్తోంది. కాగా విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది.విజయ్ ప్రస్తుతం తన 61 వ చిత్రం అట్లీ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత మురుగదాస్ తో చిత్రాన్ని విజయ్ ప్రారంభించనున్నాడు.ఈ ఏడాదే ఈ చిత్రం ప్రారంభం కానుంది . కాగా మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

 
Like us on Facebook