ఇప్పుడు సోషల్ మీడియా సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేస్తున్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన “పుష్ప 2 ది రూల్” మొదటి సాంగ్ అని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఇప్పుడు భారీ రీచ్ సొంతం చేసుకొని అదరగొడుతుంది.
అయితే ఇప్పుడు పుష్ప తర్వాతి సాంగ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం పుష్ప నెక్ట్స్ సాంగ్ ఈ రానున్న జూన్ నెలలో ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.