ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “గీతాంజలి మళ్ళీ వచ్చింది”?

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “గీతాంజలి మళ్ళీ వచ్చింది”?

Published on May 5, 2024 7:57 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు బాగా ఎక్కువగా వస్తున్నా సంగతి చూస్తూనే ఉన్నాము. పెద్దగా స్కోప్ లేకపోయినా ఎప్పుడో సినిమాలకి కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. అలా వచ్చిన లేటెస్ట్ సీక్వెల్ చిత్రమే “గీతాంజలి మళ్ళీ వచ్చింది”. యంగ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస రెడ్డి, సునీల్ అలాగే సత్యం రాజేష్, కమెడియన్ సత్య తదితరులు నటించిన ఈ చిత్రం డీసెంట్ స్పందన అందుకుంది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం ఈ సినిమా ఈ మే 10 నుంచి ఓటిటిలో అందుబాటులో ఉండనుంది అని వినిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఆరోజు నుంచి రానుందట.

ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు అలాగే కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు