తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న ‘సతురంగ వెట్టై’ సినిమాను సత్యదేవ్ మెయిన్ లీడ్ గా తెలుగులో బ్లఫ్ మాస్టర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
కాగా ట్రైలర్ లో ప్రధానంగా కథలోని సత్య దేవ్ పాత్రనే హైలెట్ చేశారు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి… ఇవి పంచభూతాలు.. ఈ ఐదు పంచభూతాలను శాసించే స్థాయికి ఎదిగిన ఆరో పంచభూతమే డబ్బు. డబ్బు తన పై వచ్చిన అభియోగాలను చెరిపేసుకునే డస్టర్ లా పనిచేస్తుంది. కోడి పై జాలి చూపిస్తే.. చికెన్ 65 ఎలా తింటావ్. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ సాగింది. మొత్తానికి ట్రైలర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది.
ఇక ఈ చిత్రంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ నందిత శ్వేత కథానాయకిగా నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28 న రిలీజ్ కాబోతున్నది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


