“పుష్ప” పై సుక్కుకి బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మెసేజ్ వైరల్.!

Published on Jun 11, 2022 11:01 am IST


గత ఏడాది మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యి ఇయర్ ఎండ్ లో ఒక బ్లాస్ట్ లాంటి హిట్ గా నిలిచిన చిత్రం “పుష్ప ది రైజ్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మంచి రీచ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది.

అల్లు అర్జున్ అయితే అసలు ఎలాంటి సరైన ప్రమోషన్స్ కూడా లేకుండా హిందీ మార్కెట్ లో 100 కోట్ల వసూళ్లను పెట్టి నార్త్ లో తన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసాడు. ఇలా హిందీలో కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం చూసి బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ స్టన్ అయ్యారని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఇది నిజమే అని ఒక మెసేజ్ వైరల్ అవుతుంది.

రాజ్ కుమార్ హిరానికి ఈ సినిమా ఎంత నచ్చింది అంటే సుకుమార్ నెంబర్ తన దగ్గర లేకపోతే తనకున్న సోర్సెస్ ద్వారా సంపాదించి సుకుమార్ కి మెసేజ్ పెట్టి మరీ పుష్ప సినిమాని పొగిడి సుకుమార్ వర్క్ ని ఓ రేంజ్ లో ప్రశంసించారు. నేను చాలా మంది ఫ్రెండ్స్ కి పుష్ప సినిమా కోసం చెప్పగా వారు ఆశ్చర్యపోయారని సినిమాలో ప్రతి సీన్, సౌండ్ చాలా బాగున్నాయని ఇంకా ఇలాంటి సినిమాలు మీరు తీయాలని కుదిరితే మీరు ముంబై వచ్చినపుడు నాకు కాల్ చెయ్యండి కలుద్దాం అని హిరానీ మేసేజ్ చేయగా ఇప్పుడు ఇది సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :