చిరు 151వ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ?
Published on Mar 27, 2017 11:39 am IST


150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే సినీ వర్గాల్లో ఈ సినిమా గురించిన ఒక తాజా వార్త తెగ హడావుడి చేస్తోంది.
అదేమిటంటే ఈ చిత్రంలోకి బాలీవుడ్ స్టార్ హీరోఅక్షయ కుమార్ నటిస్తున్నాడట. అది కూడా విలన్ పాత్రను పోషిస్తాడట.

ఈ వార్త తెలిసిన మెగా అభిమానులంతా ఆనందంతో పాటు, ఈ విషయం నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ రోబోలో విలన్ గా నటిస్తున్న అక్షయ్ చిరు సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించే అవకాశం లేకపోలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మెగా కాంపౌండ్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని కూడా చిరు తనయుడు రామ్ చరణే నిర్మించనున్నారు.

 
Like us on Facebook