సమీక్ష : “బాయ్స్ హాస్టల్” – యూత్ కి నచ్చే కామెడీ డ్రామా

సమీక్ష : “బాయ్స్ హాస్టల్” – యూత్ కి నచ్చే కామెడీ డ్రామా

Published on Aug 27, 2023 3:04 AM IST
Boys Hostel Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: మంజునాథ్ నాయక, ప్రజ్వల్ బిపి, శ్రీవాస్తవ శ్యామ్, గగన్ రామ్, శ్రేయాస్ శర్మ, భరత్ వశిష్ట్, రిషబ్ శెట్టి(క్యామియో), తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్, పవన్ కుమార్ తదితరులు

దర్శకుడు : నితిన్ కృష్ణమూర్తి

నిర్మాణం: గల్మోహుర్ ఫిల్మ్స్, వరుణ్ స్టూడియోస్

సంగీతం: అజనీష్ లోకనాథ్

సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్

ఎడిటర్: సురేష్ ఎం

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రీసెంట్ గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన యూత్ ఫుల్ డ్రామా “హాస్టల్ హుడుగురు బేకాగిదరే” తెలుగులో కూడా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి తెలుగులో “బాయ్స్ హాస్టల్” పేరిట రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తో మన టాలీవుడ్ నుంచి రష్మీ, తరుణ్ భాస్కర్ లాంటి వారు అలాగే కన్నడ రిషబ్ కాంతారా హీరో రిషబ్ శెట్టి లాంటి ఇతర స్టార్స్ క్యామియో రోల్స్ లో నటించిన ఈ చిత్రం తెలుగులో ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక ఈ చిత్రం కథలోకి వస్తే..ఓ బాయ్స్ హాస్టల్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండే అజిత్(ప్రజ్వల్) ఓ సూపర్ షార్ట్ ఫిల్మ్ తియ్యాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్ లో తమని టార్చర్ చేసే వారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్(మంజునాథ్ నాయక్) ని తన ఫ్రెండ్స్ కలిసి చంపేసినట్టుగా రాసుకుంటాడు. అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం, తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది. మరి అసలు ఆ బాయ్స్ హాస్టల్ లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు? అందుకు వాళ్ళే కారణమా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా? ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేయలని చూస్తారు? ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయ్యింది. అందుకే తెలుగులో కూడా పెద్దగా ఆలస్యం చేయకుండా రిలీజ్ కి సిద్ధం చేసేసారు. మరి అక్కడ అయ్యిన హిట్ ఫార్ములా మన దగ్గర కూడా హిట్ అవుతుంది అని చెప్పొచ్చు. మెయిన్ గా యూత్ ని ఈ చిత్రం ఇన్ స్టెంట్ గా ఆకట్టుకునే లెవెల్లో ఉంది.

అలాగే సినిమా ఫస్టాఫ్ అంతా అంతా మంచి రేసీ స్క్రీన్ ప్లే తో ఓ ఫుల్ ఫన్ రైడ్ లా అనిపిస్తుంది. ఇక మన తెలుగు ఆడియెన్స్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన డైలాగ్స్ కానీ కొన్ని మార్పులు కానీ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటాయి.

ఇక నటీనటుల పెర్ఫామెన్స్ లకి వస్తే మొదటగా మాట్లాడుకోవాల్సింది హాస్టల్ వార్డెన్ గా కనిపించిన మంజునాథ్ నాయక్ కోసం చెప్పాలి. తనకి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ తన రోల్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు. తన కామెడీ టైమింగ్ గాని సినిమాలో తన కమిట్మెంట్, ఎమోషన్స్ చాలా బాగా చేశారు.

ఇక నటుడు నటుడు ప్రజ్వల్, శ్రీ వస్తావా శ్యామ్ ఇంకా ఇతర హాస్టల్ బాయ్స్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. ఇక ఈ చిత్రంలో కొన్ని ఫన్నీ కన్వర్జేషన్స్ అలాగే పలు ఫన్ ఎపిసోడ్స్ మంచి హిలేరియస్ గా వచ్చాయి వీటికి థియేటర్స్ లో ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఫైనల్ గా సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యామియో లు ఇచ్చిన రిషబ్ శెట్టి ఫుల్ ఫన్ జెనరేట్ చేశారు అలాగే రష్మీ గౌతమ్ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. వీటితో పాటుగా స్పెషల్ అప్పీరెన్స్ లో కనిపించిన తరుణ్ భాస్కర్ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్విస్తాడు. అలానే లాస్ట్ లో దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అపీరెన్స్ అక్కడ కూడా కొంత ఫన్ కన్వర్జేషన్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో హిలేరియస్ ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యాక ఇదే రేసీ స్క్రీన్ ప్లే సెకండాఫ్ లోకి వచ్చేసరికి కాస్త స్లో అయ్యినట్టుగా అనిపిస్తుంది. అలాగే కామెడీ డోస్ కూడా సెకండాఫ్ లో కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. దీనితో సెకండాఫ్ వరకు మాత్రం ఫస్టాఫ్ తో పోలిస్తే కొంచెం డల్ గా అనిపిస్తుంది. ఇక దీనితో పాటుగా అక్కడక్కడా కొన్ని పోర్షన్స్ సాగదీతగా అనిపిస్తాయి.

అలాగే కొన్ని కామెడీ సీన్స్ అయితే ఆల్రెడీ తెలిసిన వాటిలానే రిపీటెడ్ గా వచ్చినట్టుగా అనిపిస్తాయి. అలాగే చాలా మందికి అయితే అసలు రష్మీ రోల్ ఎందుకు వస్తుంది ఒకవేళ వచ్చినా కూడా ఆ పార్ట్ వరకు కూడా అనవసరం అనిపిస్తాయి. ఇంకా సినిమాలో ఏమంత బలమైన కథ కూడా లేదు. ఓ సింపుల్ లైన్ ని అలా సాగదీసినట్టుగా సినిమా కొనసాగుతుంది. ఆ హిలేరియస్ నరేషన్ ఉంది కాబట్టి సినిమాని కాపాడింది లేకపోతే ఫలితం వేరేలా ఉండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పాలి. ఛాయ్ బిస్కెట్ అండ్ టీం పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియెన్స్ ని మెయిన్ గా యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్ గా ఉందని చెప్పాలి సినిమా స్టార్ట్ అయ్యిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది. అలాగే ఆజనీస్ లోకనాథ్ సంగీతం చాలా ట్రెండీగా వర్కౌట్ అయ్యింది. ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సిక్షన్స్ ఇంప్రెస్ చేస్తాయి.

ఇక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ ని అందించాడు. తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది. స్క్రీన్ ప్లే, ఫన్ ఎపిసోడ్స్ ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారక్టరైజేషన్ కూడా బాగుంది. కాకపోతే సెకండాఫ్ లో నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మలచి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బాయ్స్ హాస్టల్” చిత్రంలో మెయిన్ గా కనిపించే యంగ్ నటుల పెర్ఫామెన్స్ లు అలాగే మంజునాథ నాయక్ నటన కామెడీ నరేషన్ హైలైట్స్ కాగా కొత్తదనం లేని కథ అక్కడక్కడా సాగదీత సినిమాని డల్ చేసాయి. అయితే యూత్ ని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఇక హాస్టల్ లైఫ్ ని బాగా దగ్గర నుంచి చూసిన బాయ్స్ కి ఈ హాస్టల్ బాయ్స్ చూస్తే తమని తాము చూసుకున్నట్టు అనిపించవచ్చు. ఒకింత రొటీన్ గానే ఉన్నా నవ్వుకోడానికి అయితే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు