ఆయన మునుపటి లాగే సినిమాలు చెయ్యాలి – అల్లు అర్జున్

Published on Feb 7, 2019 8:00 pm IST

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డా: బ్రహ్మానందం ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ‘లో గుండె ఆపరేషన్‌ చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా బ్రహ్మానందాన్ని బన్నీ పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. బ్రహ్మానందంగారు మునుపటి లాగే చురుకుగా సినిమాలు చేయాలనీ.. అలాగే అయన సినిమాలు చేస్తారు అని అల్లు అర్జున్ అభిలాషించారు.

ఇక బ్రహ్మానందం నిన్న ఉద‌యం హాస్పటల్ నుండి క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్స్ కి కూడా వెళ్లనున్నారని తెలుస్తోంది. కాగా ప్రముఖ హృదయ చికిత్స నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా బ్రహ్మానందంగారికి శస్త్ర చికిత్స చేశారు.

సంబంధిత సమాచారం :