బుల్లితెర పై “బ్రహ్మాస్త్రం” కి రెస్పాన్స్ ఇదే!

బుల్లితెర పై “బ్రహ్మాస్త్రం” కి రెస్పాన్స్ ఇదే!

Published on Jun 1, 2023 6:05 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బ్రహ్మాస్త్రం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టడం జరిగింది. అయితే ఈ సినిమా ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం అయ్యింది.

ఈ చిత్రానికి 6.56 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ తరహా రెస్పాన్స్ అంటే చాలా బెటర్ అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తనూజ్ టీకు, ప్రితం లు సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ పతాకాల పై నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు