వారి విషయంలో డిజప్పాయింట్ గా బుట్టబొమ్మ సింగర్ అర్మాన్.!

Published on Mar 12, 2023 8:00 am IST

మన టాలీవుడ్ మ్యూజిక్ నుంచి వచ్చిన ఎన్నో సెన్సేషనల్ హిట్ సాంగ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం నుంచి థమన్ అందించిన సాంగ్స్ కి ఓ ప్రత్యేక స్థానం పడిపోయింది. అయితే ఈ సాంగ్స్ లో అతి పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ అయితే బుట్ట బొమ్మ కాగా ఈ సాంగ్ ని ఆలపించిన ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ కి మరింత పేరు ఈ సాంగ్ తీసుకొచ్చింది.

అయితే ఈ టాలెంటెడ్ సింగర్ తనకి ఎంతో ఇష్టమైన వృత్తి విషయంలో కొందరు చేస్తున్న నిర్లక్ష్యాలు చూసి బాగా డిజప్పాయింట్ అవుతున్నాడు. తాను ఈ మధ్యకాలంలో చూసిన అన్ని లైవ్ కాన్సర్ట్(కచేరి) లలో కొందరు ప్రముఖులు కనీసం పాటకు లిప్ సింక్ కూడా ఇవ్వకపోవడం బాధాకరం గా ఉందని పాట లైవ్ గా పాడకపోయినప్పటికీ కనీసం దానికి లిప్ మూమెంట్ కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎలా అని తాను పోస్ట్ చేసాడు. మనం కళకి గౌరవం ఇవ్వనట్టైతే మన తర్వాత తరాల వారు ఎలా గౌరవిస్తారు అని ఇదేనా మనం వారికి నేర్పేది అంటూ ఈ టాలెంటెడ్ సింగర్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. దీనితో తన ట్వీట్ ఇప్పుడు ఎవరికోసం అన్నాడు అనేది వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :