టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘వన్ – నేనొక్కడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఒక స్పెషల్ మార్క్ వేసింది. ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్‌గా భావించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. మహేష్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ చిత్రమని, సుకుమార్ ప్రతిభకు నిదర్శనమని విమర్శకులు కూడా కొనియాడారు.
అయితే, ఈ సినిమా వచ్చి పన్నెండేళ్లు పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాలేదు. త్వరలోనే ఈ క్రేజీ కాంబో మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘వారణాసి’ చిత్రం తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై మహేష్ బాబు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సుకుమార్‌తో సినిమా చేయడంపై మహేష్ ఆసక్తిగా ఉన్నట్లు సినీ సర్కిల్స్ టాక్.
2027 చివరి నాటికి మహేష్ తన కొత్త సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో మహేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని సుకుమార్‌తోనే ప్రారంభిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ కాంబోలో ఈసారి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


