మెగాస్టార్ క్రేజీ కాంబినేషన్.. ఆ కోలీవుడ్ దర్శకుడుతో సాధ్యం అయ్యేలా ఉందా!

మెగాస్టార్ క్రేజీ కాంబినేషన్.. ఆ కోలీవుడ్ దర్శకుడుతో సాధ్యం అయ్యేలా ఉందా!

Published on Oct 7, 2026 7:00 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు కాకా అనే సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో చేస్తున్న ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లైనప్ లో మరింతమంది యువ దర్శకులు ఉన్నారు. కాకపోతే వీరు మన తెలుగు సినిమా నుంచే ఉన్నారు కానీ ఓ కోలీవుడ్ యువ దర్శకుడు మెగాస్టార్ కోసం ఓ సబ్జెక్ట్ రెడి చేసినట్టు ఇప్పుడు బయటకి వచ్చింది.

ఆ దర్శకుడే లేటెస్ట్ గా డోరతి అనే సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. రజినీకాంత్, సూర్య లాంటి స్టార్స్ తో వర్క్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్ చిరు కోసం ఓ కథ సిద్ధం చేయడం చెప్పడం కూడా జరిగాయట. మంచి గ్యాంగ్ స్టర్ సినిమాలు తీయడంలో అతడికి మంచి పట్టు ఉంది. సో ఈ టాక్ విన్న మెగా ఫ్యాన్స్ కాంబినేషన్ సాధ్యం అవ్వాలని మంచి ఎగ్జైట్ అవుతున్నారు. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు