RC17: చరణ్ కోసం ఆ స్టార్ హీరోయిన్ ఖచ్చితంగా లేనట్టేనా?

RC17: చరణ్ కోసం ఆ స్టార్ హీరోయిన్ ఖచ్చితంగా లేనట్టేనా?

Published on Oct 7, 2026 3:01 PM IST

rc17

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మొదలు పెట్టనున్న సంచలన ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ కలయికలో చేయనున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ అతి త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ సినిమా ఇంకా ఆరంభం కాలేదు కానీ కొన్ని రూమర్స్ మాత్రం అలా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా హీరోయిన్ ఎవరు అనేది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

అయితే ఫ్యాన్స్ డిమాండ్ లలో చరణ్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన బ్యూటీ కీయారా అద్వానీ కూడా ఉంది. అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ లో కీయారా భాగం కాకపోవడానికే ఇప్పుడు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కీయారా దంపతులు రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా షూట్ స్టార్ట్ అవ్వడానికే ఇంకో రెండు మూడు నెలలు ఈజీగా పడుతుంది అని తెలుస్తోంది.

సో ఈ పరిస్థితిలు చూస్తే ఈ బిగ్ ప్రాజెక్ట్ లో కీయారా భాగస్వామ్యం కాకపోవడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో దాదాపు ఈమె సినిమాకి ఉండకపోవచ్చు. ఇక మిగతా పేర్లలో ఎవరైనా ఫైనల్ అవుతారేమో చూడాలి. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు