‘రణబాలి’ హై వోల్టేజ్ ట్రైలర్ రన్ టైం, రిలీజ్ టైం లాక్.. ఇక విధ్వంసమే!

‘రణబాలి’ హై వోల్టేజ్ ట్రైలర్ రన్ టైం, రిలీజ్ టైం లాక్.. ఇక విధ్వంసమే!

Published on Oct 7, 2026 3:53 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఉన్న నెక్స్ట్ సినిమానే రణబాలి. యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం కాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ రిలీజ్ కి ఇప్పుడు సమయం దాని తాలూకా రన్ టైం కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు మేకర్స్.

త్రిశూలం పట్టుకున్న విజయ్ పవర్ ఫుల్ పోస్టర్ తో మొత్తం 3 నిమిషాల 47 సెకండ్ల పాటు సాగే హై వోల్టేజ్ ట్రైలర్ ని రేపు అక్టోబర్ 8 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసారు. సో రణబాలి విధ్వంసం మరో రోజులో మొదలు కానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి అజయ్, అతుల్ లు సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు