ఇంటర్వ్యూ : డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల – ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్.. అందరూ ఎంజాయ్ చేస్తారు..!

ఇంటర్వ్యూ : డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల – ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్.. అందరూ ఎంజాయ్ చేస్తారు..!

Published on Oct 7, 2026 8:50 PM IST

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ శ్రీ విష్ణు నటిస్తున్ లేటెస్ట్ చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించగా కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు జానకి రామ్ మారెళ్ల విలేకరుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు.

టైటిల్ ‘కామ్రేడ్ కళ్యాణ్’.. కానీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపిస్తోంది?

‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్ నేరుగా ఈ కథ నుంచే పుట్టుకొచ్చింది. శ్రీవిష్ణు అసలైన బలం హాస్యమే, ఈ చిత్రంలో ఆ వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అనుకోకుండా ఒక చిక్కులో పడ్డ వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే అంశాన్ని పూర్తస్థాయి ఎంటర్‌టైనింగ్ కోణంలో ఎంతో ఆసక్తికరంగా మలిచాం.

చాలా రిస్కీ లొకేషన్స్ కనిపిస్తున్నాయి?

కథ కోసం మంగళూరు సమీపంలోని ఆగుంబె దట్టమైన అడవుల్లో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. షూటింగ్ తొలి రోజే నేను ఒక పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను. మా చిత్రబృందం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశారు.

కామెడీ కథ కదా? అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు?

ఈ రోజుల్లో ప్రేక్షకులు కథలో సహజత్వాన్ని, ఆ కథకు తగిన నిజమైన వాతావరణాన్ని మాత్రమే చూడటానికి ఇష్టపడుతున్నారు. వారికి సరికొత్త వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతోనే మేం ఇంత పెద్ద రిస్క్ చేశాం. మా హీరో శ్రీవిష్ణు గారితో పాటు నిర్మాతలు కిట్టు గారు, కోన వెంకట్ గారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది.

శ్రీ విష్ణు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

శ్రీవిష్ణు గారు ఈ సినిమా కోసం అందించిన సహకారం మర్చిపోలేనిది. ఒక షాట్ కోసం ఆయన మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ కూడా చేశారు. సినిమాపై ఎంతో ప్రేమ ఉన్న ఆయన, ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా గమనిస్తూ నన్ను, నా కథను పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. నా దృష్టిలో ఆయన దేవుడితో సమానం. సెట్స్‌లో ఎన్నో ఇంప్రవైజేషన్స్ చేస్తూ, తన ఫుల్ ఫన్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఆయన చేసిన సహాయం నిజంగా అద్భుతం.

రాధిక గారి గురించి?

రాధిక గారు అద్భుతమైన నటి. ఆమె చేసిన పాత్రలు మెమరబుల్‌గా ఉంటాయి. ఇందులో బాలయ్య బాబు ఫ్యాన్‌లా కనిపిస్తారు. అలాగే మదర్ క్యారెక్టర్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ చాలా కీలకం.

సత్య క్యారెక్టర్ గురించి?

ఈ పాత్ర రాసుకున్నప్పుడే సత్య పేరు అనుకున్నాను. ఇందులో తన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.

మ్యూజిక్ గురించి?

ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే వీటికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు