బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్‌ను వారు ఈరోజు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ మొదటి కుమార్తె సారాయాతో పాటు చిన్నారి బూటీస్‌ను చేతుల్లో పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్‌ను షేర్ చేశారు.
వీరు తల్లిదండ్రులుగా మారిన ఏడాది తిరగకముందే ఈ గుడ్ న్యూస్‌తో రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూలై 15, 2025న ఈ దంపతులకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులయ్యాక తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గానే ఉంచిన సిద్ధార్థ్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’ కార్యక్రమానికి వచ్చినప్పుడు తండ్రి కావడం తన జీవితంలోనే బెస్ట్ పార్ట్ అని ఆనందం వ్యక్తం చేశాడు.
ఆ సందర్భంలో సల్మాన్ ఖాన్ సరదాగా రెండో చిన్నారి గురించి కూడా ప్రస్తావించాడు. ఇక సినిమాల విషయానికొస్తే, కియారా ఇటీవల ‘టాక్సిక్’ చిత్రంలో నటించగా, సిద్ధార్థ్ ‘ది వన్’ చిత్రంలో కనిపించాడు.


