ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఆమేనా ?

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధకృష్ణ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు. ఏప్రిల్ నుండి ఈ సినిమా ప్రారంభం కానుంది.

గోపికృష్ణ మూవీస్ సంస్థలో కృష్ణం రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం లొకేషన్ సెర్చ్ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది.