టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న అయలాన్, కెప్టెన్ మిల్లర్!

టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న అయలాన్, కెప్టెన్ మిల్లర్!

Published on Jan 26, 2024 10:12 PM IST

ఈరోజు టాలీవుడ్ లో రెండు డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, అరుణ్ మాతేస్వరన్ దర్శకత్వం లో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్. మరొకటి యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆర్. రవి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అయలాన్. ఈ రెండు చిత్రాలు తమిళం లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

ఈ చిత్రాలు రెండు కూడా శాటిలైట్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాల శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ లో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, అదితి బాలన్ లు కీలక పాత్రల్లో నటించగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన అయలాన్ లో రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికార్ లు కీలక పాత్రల్లో నటించగా, ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు