సందీప్ కిషన్ “గల్లీ రౌడీ” సెన్సార్ పూర్తి!

Published on Jul 26, 2021 3:02 pm IST

సందీప్ కిషన్, నేహా శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణ లో ఎంవీవీ సినిమాస్ పతాకం పై ఎంవీవీ సత్య నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్ లని సైతం విడుదల చేసింది. అయితే ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ధియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :