సెన్సార్ పూర్తిచేసుకున్న ‘ఛలో’ చిత్రం !

29th, January 2018 - 04:38:03 PM

నాగ శౌర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఛలో’. నూతన దర్శకుడు వెంకీ కుడుములు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంకాగా తాజాగా చిత్ర సెన్సార్ పనులు ముగిశాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. దీంతో సినిమా ఫిబ్రవరి 2న విడుదలయ్యేందుకు అన్ని దారులు క్లియర్ అయ్యాయి.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా ఈ మధ్యే జరిగిన ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకావడంతో సినిమాకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ లభించింది. రొమాంటిక్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మించారు.