చరణ్ దసరాకు దిగిపోతాడా ?
Published on Oct 17, 2017 2:59 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘రంగస్థలం 1985’ పూర్తికాక ముందే మరొక సినిమాకు సన్నద్ధమవుతున్నాడు. అదే మాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా. ఫుల్ మాస్ ఇమేజ్ కలిగిన ఈ ఇద్దరూ కలిసి చేస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటి నుండే భారీ అంచనాలు మొదలైపోయాయి. మెగా అభిమానులైతే చరణ్ కు పక్కా మాస్ సినిమా పది చాలా కాలమవుతుండటంతో ఈ సినిమా భారీ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు.

సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఈ డిసెంబర్లో లాంచ్ చేస్తారని, ‘రంగస్థలం’ పూర్తైన వెంటనే మొదలుపెడతారని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది దసరాకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట బోయపాటి. ఈ ప్లాన్ ఎంతవరకు పక్కనో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 
Like us on Facebook