మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చరణ్ సినిమా !

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్, తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది. నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నటి స్నేహ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. కైరా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఈ మూవీ లో మంచి ఫన్ ఉండబోతుందని సమాచారం. చరణ్ ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.