జనవరి నుండి మొదలుకానున్న రామ్ చరణ్ కొత్త సినిమా ?
Published on Oct 15, 2017 5:23 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం-1985’ సినిమా చేస్తున్న సంగతి విదితమే. అది పూర్తవగానే ఆయన బోయపాటి శ్రీనుతో ఒక సినిమాను చేయాలని ఇది వరకే డిసైడయ్యారు. హీరోలను మాస్ లుక్ లో ప్రెజెంట్ చేయడంలో సిద్ధహస్తుడైన బోయపాటి, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది సంక్రాతి తర్వాత ప్రారంబించనున్నారని వినికిడి. ఎందుకంటే అప్పటికే చరణ్ చేస్తున్న ‘రంగస్థలం-1985’ అన్ని పనుల్ని పూర్తి చేసుకోనుంది. అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు. ఇకపోతే బోయపాటి చిరంజీవితో సైతం ఒక సినిమాని చేయనున్నారు.

 
Like us on Facebook